- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహానగర ప్రజా రవాణాపై కీలక ఫోకస్.. 30న ‘UMTA’ వర్కింగ్ గ్రూపుల ఉన్నతస్థాయి భేటీ
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో ప్రజారవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేసిన హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఉమ్టా) నాలుగు వర్కింగ్ గ్రూపుల చైర్మన్ల సమావేశం ఈనెల 30న జరగనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో ప్రజారవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేసిన హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఉమ్టా) నాలుగు వర్కింగ్ గ్రూపుల చైర్మన్ల సమావేశం ఈనెల 30న జరగనుంది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ కమిటీ చైర్మన్‌గా ఉన్న జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్) కమిటీ చైర్మన్‌గా ఉన్న హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్, రోడ్డు అభివృద్ధి, ట్రాఫిక్, రవాణా కమిటీకి చెందిన మూడు కార్పొరేషన్ల పరిధిలోని 12 మంది జోనల్ కమిషనర్లు హాజరుకానున్నారు.
సమావేశంలో హెచ్‌ఎండీఏ పరిధిలోని ట్రాఫిక్ నిర్వహణ, ప్రజారవాణా వ్యవస్థ బలోపేతం, రహదారుల అభివృద్ధి, ట్రాన్స్‌పోర్ట్ సమన్వయం వంటి కీలక అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. అలాగే ఉమ్టా వర్కింగ్ గ్రూపుల్లో చురుకుగా పనిచేస్తున్న అధికారులను సభ్యులుగా నియమించే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ నిర్వహణ, ప్రజారవాణా సేవల మెరుగుదలకు దోహదపడనున్నాయని అధికారులు భావిస్తున్నారు.






