మల్నాడు రెస్టారెంట్ యజమాని డ్రగ్స్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-18 03:19:51  IST  )

మ‌ల్నాడు రెస్టారెంట్ య‌జ‌మాని సూర్య ఇటీవ‌ల డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. సూర్య డ్రగ్స్ సరఫరాతో పాటు పలు పబ్‌ల నిర్వహకులతో కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టు ఈగల్ టీం గుర్తించింది.

మల్నాడు రెస్టారెంట్ యజమాని డ్రగ్స్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు
X

తెలంగాణ‌, వెబ్ డెస్క్: మ‌ల్నాడు రెస్టారెంట్ య‌జ‌మాని సూర్య ఇటీవ‌ల డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. సూర్య డ్రగ్స్ సరఫరాతో పాటు పలు పబ్‌ల నిర్వహకులతో కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టు ఈగల్ టీం గుర్తించింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. సూర్య‌కు ముగ్గురు ప‌బ్ య‌జ‌మానులతో సంబంధాలు ఉన్న‌ట్టు పోలీసులు గుర్తించారు. 2 ప‌బ్ ల య‌జ‌మానుల‌తో క‌లిసి సూర్య డ్ర‌గ్స్ పార్టీలు కూడా నిర్వ‌హించిన‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ప‌బ్ ల‌లో డ్ర‌గ్స్ పార్టీల కోసం యాజ‌మాన్యాలు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశాయి. ఈ వ్య‌వ‌హారంలో క్వాక్ ప‌బ్ య‌జ‌మాని రాజ‌శేఖ‌ర్, కోరా ప‌బ్ య‌జ‌మాని పృథ్వి వీర‌మాచినేని, బ్రాడ్ వే ప‌బ్ య‌జ‌మాని రోహిత్ ల‌పై కేసులు న‌మోదు చేశారు. ఈ ప‌బ్‌ల యజమానులతో పార్టీలు నిర్వహించగా మరో నాలుగు పబ్ ల యజమానుల పాత్రపైనా ఈగల్ టీం విచారణ జరుపుతోంది.

Next Story