జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ కీలక పరిణామం

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పునాదుల మీద ఏర్పడిందని డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ కీలక పరిణామం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పునాదుల మీద ఏర్పడిందని డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలని అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. ఈ సమాజం కోసం పని చేస్తున్న ఇందిరమ్మ ప్రజా ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం కోసం క్రైస్తవ ప్రతినిధులు సమావేశం కావడం శుభ పరిణామన్నారు. శనివారం జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా పాస్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట్ స్వామి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీలు విశ్వనాథ్, సంపత్ కుమార్, దీపక్ జాన్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. నవీన్ యాదవ్ కు పాస్టర్ లు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి, దీవించడం కోసం వచ్చిన పాస్టర్లకు, క్రైస్తవ సంఘ ప్రతినిధులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అజయంగా నిలవాలని ప్రార్థనలు చేయడంతో పాటు ఆశీస్సులు అందిస్తున్నారని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను పెద్ద మెజారిటీతో గెలిపించారన్నారు.

Next Story