- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సృష్టి ఐవీఎఫ్ కేసులో కీలక పరిణామం.. డా.నమ్రతకు 5 రోజుల పోలీసు కస్టడీ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ (Universal Shrishti Fertility Center) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ (Universal Shrishti Fertility Center) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్రమ సరోగసీ, శిశు విక్రయాలకు సంబంధించి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ యజమాని డాక్టర్ అథలూరి నమ్రత, ఆమె కుమారుడు జయంత్ కృష్ణ, మరికొంత మంది నిందితులను గోపాలపురం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సరోగసీ పేరిట శిశు అక్రమ విక్రయానికి పాల్పడిన వైద్యురాలు నమ్రత, జయంత్ కృష్టలను కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు సికింద్రాబాద్ కోర్టును కోరారు. నమ్రత వద్ద సరోగసీ, ఐవీఎఫ్ కోసం వచ్చిన వారి వివరాలు లభ్యమయ్యాయని, మరిన్ని విషయాలు రాబట్టేందుకు వారం రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. తాజాగా డాక్టర్ నమ్రతను 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. దీంతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి.
రాజస్థాన్‌కు చెందిన దంపతులు సోనియా, గోవింద్ సింగ్‌లు ఐవీఎఫ్ ప్రొసీజర్‌లో పిల్లలను కనేందుకు గతేడాది ఆగస్టులో డాక్టర్ నమ్రతను కలిశారు. ఐవీఎఫ్ ద్వారా సాధ్యం కాదు.. సరోగసితో అవుతుందని ఆమె వారికి చెప్పింది. ఇందుకోసం రూ.30 లక్షలు ఖర్చు అవుతాయని, చెప్పారు. రూ.15లక్షల నగదు, మరో రూ.15లక్షలకు చెక్కు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో తొలుత ఆగస్టులో రూ.5లక్షలు నమ్రత ఖాతాకు దంపతులు బదిలీ చేశారు. సెప్టెంబర్‌లో నిర్వాహకులు విశాఖకు దంపతులను పిలిచి స్పెర్మ్, అండం సేకరించారు. విడతల వారీగా నగదును బాధితులు డాక్టర్ నమ్రత ఖాతాలో జమ చేశారు. ఈ ఏడాది మే నెలలో మొత్తం నగదును బాధితులు చెల్లించారు. డెలీవరీ అనంతరం ఒప్పందం ప్రకారం దంపతులు ఆ బిడ్డకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని కోరారు. ఇందుకు డాక్టర్ నమ్రత నిరాకరించారు. దీంతో ఆ దంపతులు ఢిల్లీలో శిశువుకు డీఎన్ఏ పరీక్ష చేయించగా, తమ బిడ్డ కాదని తేలింది. దీంతో సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్‌పై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. డా.నమ్రత, సిబ్బందిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నమ్రతను విచారిస్తే కీలక విషయాలు బయటపడతాయని భావిస్తున్నారు. కాగా, ఇష్టం లేకనో, స్థోమత లేదనో అబార్షన్‌కు వెళ్లే దంపతులను గుర్తించి, వారికి తన ఏజెంట్ల ద్వారా డబ్బు ఆశ చూపి వారిని ఒప్పించి.. వారికి పుట్టే చిన్నారులను నమ్రత తన అక్రమ దందాకు ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.






