- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: బీసీ రిజర్వేషన్ల అంశంలో కీలక పరిణామం
బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్డినెన్స్‌ను తెలంగాణ సర్కార్‌కు గవర్నర్(Telangana Governor) వద్దకు పంపింది.

దిశ, వెబ్‌డెస్క్: బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్డినెన్స్‌ను తెలంగాణ సర్కార్‌కు గవర్నర్(Telangana Governor) వద్దకు పంపింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం -2018లోని సెక్షన్ 285(A)కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ముసాయిదాను ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖ సిద్ధం చేసింది. గవర్నర్ ఆమోదం పొందగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఖరారు కోసం.. ఇప్పటికే ఉభయసభలు ఆమోదించిన బిల్లు, కులగణన సర్వే ఎంపిరికల్ డేటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇస్తుంది. రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నది. ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల కేబినెట్ నిర్ణయించింది.






