- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. రెడ్ కార్నర్ నోటీస్‌పై అమెరికా కసరత్తు
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం రేపిన (Phone Tapping Case) ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao)ను భారత్ రప్పించే ప్రయత్నంలో కీలక ముందడుగు పడింది. ఇంటర్‌పోల్ గత మార్చి 10న జారీ చేసిన రెడ్‌కార్నర్ నోటీసులు అమలు ప్రక్రియను తాజాగా అమెరికా ప్రభుత్వం ప్రారంభించినట్లు సమాచారం. ప్రభాకర్ రావును అమెరికా నుంచి భారత్ పంపించేందుకు యూఎస్ హోం ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. గతంలో తనను పొలిటికల్ అసైలమ్ (రాజకీయ శరణార్ధి) గా గుర్తించాలని ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. దీంతో ప్రభాకర్ రావును రాజకీయ శరణార్ధిగా గుర్తించకుండా ఫోన్ ట్యాపింగ్ అక్రమాలను నివేదిక రూపంలో దర్యాప్తు బృందం (సిట్) పంపింది.
రాష్ట్రంలో కీలక వ్యక్తుల వ్యక్తిగత సంభాషణల్ని అక్రమంగా ట్యాప్ చేయించడంలో ఆయన పాత్ర గురించి సిట్ అధికారులు నివేదికలో పొందుపరిచారు. ఈ క్రమంలోనే యూఎస్ హోం ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రభాకర్ రావును భారత్‌కు డిపోర్ట్ చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు అతను తప్పించుకునేందుకు ఉన్న దారులను క్లోజ్ చేసేందుకు సిట్ టీమ్ బలంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈ కేసులో A-1గా ఉన్న ప్రభాకర్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బయటకురావడంతో ఆయన దేశం దాటి అమెరికా వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు నిర్ణయం వెలువరిస్తూ న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ప్రభాకర్‌రావును కోర్టు ఇదివరకే ఆదేశించింది. ఒక వేళ హాజరుకాకుండా తప్పించుకుని తిరిగితే అఫెండర్‌గా ప్రకటిస్తామని హెచ్చరించింది. జూన్ 20 లోపు హాజరు కావాలని ప్రభాకర్ రావుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్‌ఐబీ మాజీ చీఫ్ నివాసానికి నోటీసులు అంటించారు. ప్రభాకర్‌రావు హాజరైతేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే చాన్స్ ఉంది. అయితే, ఆయన స్వదేశానికి తిరిగి వస్తారా లేక మరేదైనా సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.






