ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ కేసులో కీలక పరిణామం.. ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-14 14:10:46  IST  )

ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రొసిక్యూషన్‌కు సైతం గవర్నర్ నుంచి అనుమతి లభించింది.

ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ కేసులో కీలక పరిణామం.. ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు(Formula-E Race Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐఏఎస్ అరవింద్ కుమార్(IAS Arvind Kumar) ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR) ప్రొసిక్యూషన్‌కు సైతం గవర్నర్ నుంచి అనుమతి లభించింది. రాజకీయ నాయకులు, అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతితో ఏసీబీ అధికారులు ఛార్జిషీట్‌ దాఖలుకు సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఫార్ములా-ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే తుది నివేదికను సైతం సిద్ధం చేశారు. ఈ నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించారు. ఏ1 మాజీ మంత్రి కేటీఆర్‌, ఏ2 ఐఏఎస్ అధికారి అరవింద్‌, ఏ3 BLN రెడ్డి, ఏ4, ఏ5లుగా FEO ప్రతినిధులను తుది నివేదికలో ప్రస్తావించారు. ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహించాలన్నది కేటీఆర్ సొంత నిర్ణయమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ అనుమతులు లేకుండానే రేస్ నిర్వహించడంతో క్విడ్ ప్రో కో జరిగిందని వివరించారు. బీఆర్ఎస్‌కు రూ.44 కోట్ల ఎలక్ట్రోరల్‌ బాండ్లు అందాయని తుది నివేదికలో పేర్కొన్నారు. ట్రైపార్టీ అగ్రిమెంట్‌కు ముందే బీఆర్ఎస్‌కి ఈ-బాండ్లు చెల్లించారని తెలిపారు.

Next Story