కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామం.. సునీతా‌ రావుకు షోకాజు నోటీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-21 08:29:36  IST  )

కాంగ్రెస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామం.. సునీతా‌ రావుకు షోకాజు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతరావు (Sunitha Rao)కు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (All India Women's Congress Committee) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ పదవులు విషయంలో ఆమె ఇటీవలే కొంతమంది మహిళా నేతలతో కలిసి గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ (TPCC Chief Mahesh Kumar Goud) చాంబర్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.

అదేవిధంగా తనకు సీఎం రేవంత్ రెడ్డి సహచరించడం లేదంటూ బహిరంగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలోనూ సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో తాజాగా గోషామహాల్ కాంగ్రెస్ మహిళా నేతలు సునీతరావు వ్యవహారంపై పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ (Delhi) పెద్దలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో పీసీసీ (PCC) మహేష్ కుమార్ గౌడ్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ.. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (All India Women's Congress Committee) అధ్యక్షురాలు ఆల్కాలాంబా ఇవాళ సునీత రావుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులలో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సునీతా రావు షోకాజు నోటీసుల వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story