బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం.. విచారణకు సమయం కోరిన దగ్గుబాటి రానా

by Kema Shiva Kumar |

తెలంగాణ‌ (Telangana)లో బెట్టింగ్ యాప్ కేసు (Betting Apps Case) సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం.. విచారణకు సమయం కోరిన దగ్గుబాటి రానా
X

దిశ, వెబ్‌‌డెస్క్: తెలంగాణ‌ (Telangana)లో బెట్టింగ్ యాప్ కేసు (Betting Apps Case) సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఈడీ (Enforcement Directorate) అధికారులు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ప్రముఖ యాప్‌ల తరఫున ప్రచారం చేసిన పలువురు సినీ ప్రముఖులకు సోమవారం నోటీసులు జారీ చేశారు. అందులో దగ్గుబాటి రానా (Daggubati Rana), ప్రకాశ్‌రాజ్, విజయ్‌ దేవరకొండ, మంచు లక్ష్మిలు తదితరులు ఉన్నాయి. అయితే, దగ్గుబాటి రానాను ఈనెల 23న, ప్రకాశ్‌రాజ్‌‌ను 30న, విజయ్‌ దేవరకొండను ఆగస్టు 6న, మంచులక్ష్మిని ఆగస్టు 13న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ అధికారులు నోటీసులలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో విచారణకు దగ్గుబాటి రానా రేపు హాజరు కావాల్సి ఉంది. అయితే, తనకు షూటింగ్ షెడ్యూల్ ఉన్నందున విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఈడీ అధికారులు సమచారం అందజేశారు. తనకు మరింత ఇవ్వాలని దగ్గుబాటి రానా అధికారులను రిక్వెస్ట్ చేశారు.

Next Story