- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోక్సో కేసులో కీలక పరిణామం.. బండి భగీరథ్ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పొక్సో (POCSO) కేసు నిందితుడు బండి భగీరథ్ ఉచ్చు మరింత బిగుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పొక్సో (POCSO) కేసు నిందితుడు బండి భగీరథ్‌కు ఉచ్చు మరింత బిగుస్తోంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న భగీరథ్‌ను విచారించేందుకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టు పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిందితుడిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే తీవ్ర ఆరోపణలపై బండి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరింత సమాచారాన్ని, కీలక ఆధారాలను రాబట్టేందుకు నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అనుమతితో రేపటి (బుధవారం) నుంచి మూడు రోజుల పాటు పోలీసులు భగీరథ్‌ను పోలీసులు విచారించనున్నారు.
మరోవైపు ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్).. బాధితురాలితోపాటు ఆమె తల్లి వద్ద నుంచి కీలక విషయాలు సేకరించారు. అదే సమయంలో బండి భగీరథ్ 10 మంది ఫ్రెండ్స్‌ను విచారణ చేసి.. వారి వద్ద నుంచి కూడా కీలక సమాచారాన్ని రాబట్టారు. ఆరోపణలు రుజువు అయితే.. మరింత ఎక్కువ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో మూడ్రోజుల బండి భగీరథ్ కస్టడీ విచారణ ఈ కేసులో అత్యంత కీలకం కానుంది.






