- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ బైపోల్ బిగ్ అప్‌డేట్.. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. నవంబర్ 11న పోలింగ్ జరిగే ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్లుగా ఇప్పటికే రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. నవంబర్ 11న పోలింగ్ జరిగే ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లుగా ఇప్పటికే రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. ఈ మేరకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఇవాళ గుర్తులను కూడా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, బ్యాలెట్ పేపర్‌లో మొదటి స్థానం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి (కమలం), రెండో స్థానం కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్‌యాదవ్ (చేయి), మూడో స్థానం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్ (కారు)కు కేటాయించారు.
కాగా, జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో మొత్తం 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా.. 58 మంది పోటీలో ఉన్నట్లు ఆర్వో సాయిరాం వెల్లడించారు. అయితే, ఇంత మదది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో 13 మంది, 2014 ఎన్నికల్లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది పోటీపడగా.. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వారిలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే, ఆయన మరణంతో ఉప ఎన్నిక రావడంతో ఈ సారి పోటీలో ప్రధాన పార్టీలతోపాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలోకి దిగారు.
అభ్యర్థుల గుర్తుల కేటాయింపు ఇలా..: https://epaper.dishadaily.com/4072362/Dishaweb/Bypoll-candidates-Symbols#page/1/1






