- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన కేబినెట్ మీటింగ్.. కీలక నిర్ణయాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్
తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: సమ్మెబాట పట్టిన ఆర్టీసీ కార్మికులు క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో.. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. కేబినెట్ లో కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారంపై కీలకంగా చర్చించామని, రేపు ఐదుగురు మంత్రులు కార్మిక సంఘాలతో చర్చిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వం పాజిటివ్ గానే ఉందన్నారు. నర్సంపేట, నల్గొండలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యాయత్న ఘటనలపై కేబినెట్ తీవ్ర దిగ్భ్రాంతి చెందిందన్నారు. కార్మికులు ఎవరూ క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.
అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో 50 శాతం రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ లో సుమారు రూ.6 వేల కోట్ల బకాయిలున్నాయని, నెక్స్ట్ కేబినెట్ సమావేశమయ్యే నాటికి వారికి ఇవి ఎలా ఇవ్వాలన్నదానిపై క్లారిటీ ఇస్తామన్నారు. కాళేశ్వరంపై మాట్లాడుతూ.. ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు కాపీ కేబినెట్ కు అందిందని తెలిపారు. హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకున్నారని, ఏదో సాధించామని హడావుడి చేశారన్నారు. ఘోష్ కమిషన్ విచారణ రాజ్యాంగ విరుద్ధమైందని కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. కాళేశ్వరంలో లోపాలకు కేసీఆర్, హరీష్ రావు కారణం కాదని కోర్టు చెప్పలేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రాజెక్టు ప్రొసిజర్ టెక్నికల్ విషయాన్ని మినహాయిస్తే.. మిగతా విషయాలను కోర్టు తప్పు పట్టలేదన్నారు. NDSA, విజిలెన్స్ రిపోర్ట్, కాగ్ రిపోర్టులు ఆధారంగా సీబీఐ విచారణ చేయాలని లేఖ రాశామన్నారు. ఈ లేఖ రాసి 9 నెలలు అయినా చర్యలు లేవన్నారు. దీనిపై ఢిల్లీకి వెళ్లి సీబీఐని కలుస్తామన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి చేయాలని కేబినెట్ నిర్ణయించామన్నారు. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలో సబ్ కమిటీ వేశామన్నారు. సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కూడా కేబినెట్ నిర్ణయించిందని, త్వరలోనే ఎన్నికల తేదీలు వెల్లడిస్తామని తెలిపారు.






