TG: కేబినెట్‌‌లో కీలక నిర్ణయాలు.. ఇక నుంచి ఆ ప్రాంతమంతా అర్బన్ తెలంగాణే

by Gantepaka Srikanth |

తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

TG: కేబినెట్‌‌లో కీలక నిర్ణయాలు.. ఇక నుంచి ఆ ప్రాంతమంతా అర్బన్ తెలంగాణే
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం 90 పోస్టులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. 11 జిల్లాల్లో 104 మండలాలు 1355 గ్రామాలతో హెచ్‌ఎండీఏ పరిధి(HMDA Purview)ని విస్తరించినట్లు చెప్పారు. దీంతో 332 రెవెన్యూ గ్రామాలు ఈ పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. ఓఆర్ఆర్(ORR) నుంచి ఆర్ఆర్ఆర్(RRR) వరకు అర్బన్ తెలంగాణగా.. మిగతా ప్రాంతమంతా రూరల్ తెలంగాణగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్ఆర్ఆర్‌కు రెండు కిలోమీటర్లు బఫర్‌తో ఫ్యూచర్ సిటీగా మార్చినట్లు చెప్పారు.

అలాగే.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద 2025 పాలసీని మహిళల కోసం కేబినెట్‌లో ఆమోదించినట్లు చెప్పారు. యాదగిరిగుట్ట బోర్డులో గతంలో 18 ఏళ్లు వయసు వచ్చిన వారికే సభ్యులుగా అవకాశం ఉండేది.. ఇప్పుడు దానిని 15 ఏళ్లకే కుదించాం.. 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు సభ్యులుగా ఉండొచ్చని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అంతేకాదు.. హైదరాబాద్ వేదికగా జరుగబోతున్న మిస్ వరల్డ్ పోటీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణకు సైతం ఆమోదం లభించింది.

కేబినెట్ నిర్ణయాలు :

= ఎస్సీ వర్గీకరణకు ఆమోదం

= యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు

= 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి

= ఒకే గొడుకు కిందకు అన్ని మహిళా సంఘాలు

= మిస్ వరల్డ్ పోటీలకు గ్రీన్ సిగ్నల్

= ఫ్యూచర్ సిటీ బోర్డు ఏర్పాటు

Next Story