- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
బీహార్‌పై కేంద్రం వరాల జల్లు కురిపించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ (Union Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. బిహార్ లో (Bihar) బక్సర్-భగల్పూర్ హై స్పీడ్ కారిడార్ లో 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేబినెట్ వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ కారిడార్ లో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 84 కిలో మీటర్ల జాతీయ రహదారికి రూ. 4,447 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఈ విభాగం భాగల్పూర్‌కు అనుసంధానించే మోకామా, బరాహియా, లఖిసరై, జమల్‌పూర్, ముంగేర్ వంటి ముఖ్యమైన ప్రాంతీయ నగరాల గుండా వెళుతుంది లేదా వాటికి కనెక్టివిటీని అందిస్తుంది. అయితే త్వరలో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బిహార్ పై వరాలు కురిపించడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.
Next Story






