- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం.. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం
కృష్ణా నదీ జలాల అంశంపై నేడు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, విడుదలపై అధికారులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై నేడు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, విడుదలపై అధికారులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి తెలంగాణకు 10 టీఎంసీల నీళ్లు అందిచాలని నిర్ణయించారు. ఏపీకి 16 టీఎంసీలు కేటాయించారు. శ్రీశైలం నుండి తెలంణకు 16 టీఎంసీల నీటిని కేటాయించారు. ఆగస్టు 15 వరకు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది. ఇక ఎల్లుండి మరోసారి దీనిపై చర్చించేందుకు కేఆర్ ఎంబీ సమావేశం కానుంది.
ఇదిలా ఉంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుండి ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా అధిక మొత్తంలో నీటిని తరలిస్తోందని తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ వివాదాలకు ముగింపు పలికేలా బోర్డు చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక మరోసారి బోర్డు ఎల్లుండి సమావేశం కానుండటంతో ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.






