- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సృష్టి కేసులో పోలీసుల కీలక నిర్ణయం.. 80 మంది శిశువులను వెనక్కి రప్పించే యత్నం
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సృష్టి ఫెర్టిలిటీ కేసు(Srushti Fertility Case)లో పోలీసులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సృష్టి ఫెర్టిలిటీ కేసు(Srushti Fertility Case)లో పోలీసులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ కేసులో డాక్టర్ నమ్రత ఎలాంటి సరోగసీ లేకుండా పసిపిల్లలను పేద గిరిజన పేరెంట్స్ నుంచి తక్కువ ధరకు తీసుకువచ్చి, ఆసుపత్రిలో లక్షలాది రూపాయలకు అమ్ముకున్నట్టు విచారణలో వెల్లడైంది. ఇప్పటివరకు 80 మందికి పైగా శిశువులను సరోగసీ పేరుతో విక్రయించినట్టు డాక్టర్ నమ్రత ఒప్పుకుంది. అయితే ఆయా పిల్లలను గుర్తించి, వారిని వెనక్కి రప్పిస్తామని పోలీసులు తెలిపారు. శిశువులను తొలుత శిశువిహార్ కు తరలించి, అనంతరం తల్లిదండ్రులను గుర్తించి వారికి అప్పజెప్తామని పేర్కొన్నారు.
అయితే ఈ కేసులో తమ శిశువులను అమ్ముకున్న ముగ్గురు తల్లులను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. మిగతా శిశువులు, వారి తల్లిదండ్రులను గుర్తించేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే నమ్రత ఏజెంట్లు సంతోషి, కళ్యాణి జరిపిన లావాదేవీలు, తల్లిదండ్రుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. కాగా నేడు ఈ కేసులో మరో 8 మందిని నేడు అరెస్ట్ చేసారు.






