తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఈనెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-26 06:06:44  IST  )

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఈనెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఈనెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు పూనుకుంది. జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి అందిన కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు. మొత్తం ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించబోతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. కాగా, జిస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి శుక్రవారం హైకోర్టుకు తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అందిన నివేదకను అసెంబ్లీలో ప్రవేశపెడతామని.. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కోర్టుకు ధర్మాసనానికి విన్నవించారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం ఏ రేంజ్‌లో ఉండబోతుందోనని ఇరు పార్టీల శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

కాగా, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌పై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ శుక్రవారం ధర్మాసనం వారి పిటిషన్లపై విచారణ చేపట్టగా ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. విచారణ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి చర్చించాకే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టీస్ పీ చంద్రఘోష్ ఇచ్చిన కాళేశ్వరం నివేదికను ఒకవేళ పబ్లిక్ డొమైన్‌లో పెట్టి ఉంటే వెంటనే తొలగించాలని చెప్పింది. పూర్తి వివరాలతో మూడు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ కేసులో మద్యంతర ఉత్తర్వులు అవసరం లేదని.. పిటిషనర్లు కోరిన విధంగా స్టే ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. కేసులో తదుపరి విచారణను ఐదు వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది.

Next Story