Telangana Constables: తెలంగాణ కానిస్టేబుళ్లకు శుభవార్త.. పోలీస్ శాఖ కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |   (  Updated:2024-10-25 12:41:47  IST  )

తెలంగాణ వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా పోలీస్ కానిస్టేబుళ్ల(Police constables) భార్యలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

Telangana Constables: తెలంగాణ కానిస్టేబుళ్లకు శుభవార్త.. పోలీస్ శాఖ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా పోలీస్ కానిస్టేబుళ్ల(Police constables) భార్యలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తమ భర్తలను కూలీల కంటే హీనంగా చూస్తున్నారని.. దయచేసి రాష్ట్రంలో ఒకే పోలీసు విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా.. ఈ ఆందోళనలపై తెలంగాణ పోలీస్ శాఖ(Telangana Police Department) స్పందించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, పోలీస్ శాఖ(Police Department) కీలక నిర్ణయం తీసుకున్నాయి. గతంలో ఇచ్చిన సెలవుల రద్దు నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అంతేకాదు.. కానిస్టేబుళ్ల కుటుంబాలతో చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటన చేశాయి. దీంతో తెలంగాణలోని బెటాలియన్ కానిస్టేబుళ్ల(Battalion Constables)కు కాస్త ఊరట లభించింది.

Next Story