TG: ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి ఇది భారీ శుభవార్త

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-21 11:45:21  IST  )

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

TG: ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి ఇది భారీ శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. డయాలసిస్‌ పేషెంట్ల(Dialysis Patients) జీవితాల్లో కొత్త ఆశల వెలుగులు నింపాలని నిర్ణయించింది. కొత్తగా మొత్తం 4,021 మంది డయాలసిస్ రోగులకు నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్లు మంజూరు చేసింది. ఇది గత ప్రభుత్వ పరిపాలనతో పోలిస్తే చాలా అధికం కావడం గమనార్హం. బీఆర్‌ఎస్ హయాంలో కేవలం 4,011 మంది డయాల‌సిస్ పేషెంట్ల‌కే ఆసరా పింఛన్ అంద‌గా.. కొత్త ప్రభుత్వంలో ఒక్క నెలలోనే దాన్ని మించి లబ్ధిదారులు ఎంపిక కావడం విశేషం.

పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క(Minister Seethakka) చొరవతోనే నూతన లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ముఖ్యంగా డయాలసిస్ బాధితులు ఏ ప‌నిచేయ‌లేరు. ప్ర‌తి నెల ఆసుప‌త్రిలో చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేప‌ధ్యంలో వారి క‌ష్టాల‌ను గుర్తించిన ప్ర‌భుత్వం వారికి పెన్ష‌న్ల‌ను మంజూరు చేసింది. వీరితో పాటు త్వ‌ర‌లో హెచ్‌ఐవీ బాధితులకు కూడా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 13,000 మంది హెచ్‌ఐవీ పేషెంట్లు తమకు పెన్షన్లు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు.

అన్ని రకాల నూతన పెన్షన్‌ దారుల ఎంపిక కోసం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్థిక శాఖ అనుమతుల కోసం వేచి చూస్తోంది. అనుమతులు రాగానే మరింత మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందే అవకాశముంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల కోసం నెలకు రూ.993 కోట్లు ఖర్చు చేస్తోంది. కొత్త పిన్ష‌న్ దారుల గుర్తింపుప్ర‌క్రియ పూర్తైతే ఇది మ‌రింత పెరిగే ఛాన్స్ ఉంది.

Next Story