అమ్మాయిల రక్షణ కోసం మరో కీలక నిర్ణయం దిశగా తెలంగాణ సర్కార్..

by Satheesh |   (  Updated:2022-12-17 14:50:28  IST  )

ఇటీవల హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూలులో చిన్నారిపై అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

అమ్మాయిల రక్షణ కోసం మరో కీలక నిర్ణయం దిశగా తెలంగాణ సర్కార్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూలులో చిన్నారిపై అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన తెలంగాణ సర్కార్.. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో అమ్మాయిల మీద జరిగే అఘాయిత్యాలను నివారించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, కాలేజ్‌లలో అమ్మాయిల రక్షణ కోసం తెలంగాణ సర్కార్ త్వరలోనే ప్రత్యేక చట్టం తీసుకువస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. అమ్మాయిలపై ఏదైనా ఘటన జరిగితే సదరు స్కూలు, కాలేజీ యాజమాన్యాలను బాధ్యులను చేయడం ఈ చట్టంతో సాధ్యమవుతుందని వివరించారు. ఈ చట్టంలో మేనేజ్ మెంట్‌ను బాధ్యతగా చేయబోతున్నామని తెలిపారు. యాంటి డ్రగ్స్ కమిటీల మాదిరేగానే ఈ ప్రత్యేక చట్టం పనిచేస్తుందని అన్నారు. అలాగే దేశంలో గోవా డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. గోవాలో ఉండి హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story