రైతులకు గుడ్ న్యూస్..మొక్కజొన్న కొనుగోళ్ల‍పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

by Prasad Jukanti |

తెలంగాణలో మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంటల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రైతులకు గుడ్ న్యూస్..మొక్కజొన్న కొనుగోళ్ల‍పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: పంట కొనుగోళ్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పండిన పంటల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో అన్నదాతలను ఆదుకునేందుకు మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా రాష్ట్రంలో మొక్కజొన్న భారీ దిగుబడుల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పంటల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలపై మంత్రి ప్రకటన చేశారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన రూ.4000 కోట్లకు అదనంగా సీఎం మరో రూ.1800 కోట్లు కేటాయించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.

జొన్న, పొద్దుతిరుగుడు కొనుగోళ్లు:

రూ.1100 కోట్లతో జొన్న కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. పొద్దుతిరుగుడు పంటను 25 శాతానికి మించి కొనుగోలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా జొన్న కొనుగోళ్ల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించిన మంత్రి.. రైతుల ప్రయోజనాలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు.

Next Story