- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వందకు వందశాతం టార్గెట్ రీచ్ అవ్వాల్సిందే’.. సమీక్షలో అధికారుల కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర అటవీ(Telangana Forest Officials), పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఆదేశాల మేరకు నిర్వహించతలపెట్టిన 2025-సంవత్సర వన మహోత్సవం ఉన్నతాధికారులు సమీక్ష చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర అటవీ(Telangana Forest Officials), పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఆదేశాల మేరకు నిర్వహించతలపెట్టిన 2025-సంవత్సర వన మహోత్సవం ఉన్నతాధికారులు సమీక్ష చేశారు. ఇప్పటివరకు మొక్కలు నాటిన ప్రాంతాలకు జియో టాగింగ్ పూర్తయినట్టు గుర్తించారు. ఈ సంవత్సరం 18.03 కోట్ల మొక్కలు టార్గెట్ పెట్టుకోగా.. 13.84 కోట్ల మొక్కలు ప్లాంటేషన్ పూర్తి చేసినట్టు వివరించారు. 77 శాతం టార్గెట్ పూర్తి చేసినట్టు స్పష్టం చేశారు. అయితే, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని మరింత విస్తరింప చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మొక్కలు పెంచే కార్యక్రమాన్ని వన మహోత్సవం పేరిట చేపడుతున్న విషయం తెలిసిందే. అటవీ అధికారులు సిద్ధం చేసిన పీపీటీనీ ప్రిన్స్ పల్ సెక్రటరీ, పీసీసీఎఫ్ వీక్షించారు.
సమగ్రంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని డిపార్టుమెంట్లలో ఈ మొక్కలు నాటుతున్నప్పుడు ఎదరవుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టి వచ్చింది. అయితే, గత ఏడాది అనుభవాల ఆధారంగా మరింత పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు వన మహోత్సవం కింద పకడ్బందీ కార్యచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో.... అన్ని మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు సన్నద్ధం అవ్వాలని ఆదేశించారు. ఈ సారి 100 శాతం మనం పెట్టుకున్న టార్గెట్ రీచ్ కావాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు.






