- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ముగ్గురు పోలీస్ కమిషనర్ల కీలక నిర్ణయం.. ఇక నుంచి ఒకే రూల్
TG: ముగ్గురు పోలీస్ కమిషనర్ల కీలక నిర్ణయం.. ఇక నుంచి ఒకే రూల్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం మొత్తంలో ట్రాఫిక్ నియంత్రణకు ఒకే రూల్ ఉండాలని నిర్ణయించారు. రౌడీషీటర్లు, అసాంఘిక శక్తుల పట్ల ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేశారు. నగరంలో భారీ వాహనాల నో ఎంట్రీకి ఒకే సమయాన్ని ఫిక్స్ చేయబోతున్నారు. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఒకేసారి చేపట్టనున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ రాకపోకలపై నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు. సింగిల్ ఫోర్స్ లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించి, బాధ్యతతో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రహదారిపై వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబందనలు పాటించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్ లేకుండా వాహనాలు నడపొద్దని, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పేర్కొన్నారు. బైక్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, వెనుక కూర్చున వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలని సూచించారు. క్రమశిక్షణ కలిగిన డిపార్ట్‌మెంట్‌లో ఉన్న మనమందరం ముందుగా ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలని సూచించారు.






