తెలంగాణ ప్రజలను తాగుబోతులుగా మార్చిందెవరు?

by Gantepaka Srikanth |

తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదాయంపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రజలను తాగుబోతులుగా మార్చిందెవరు?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదాయంపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.10 వేల కోట్ల లోపు ఉండేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయే నాటికి ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.36 వేల కోట్లకు పెరిగిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.2 వేల కోట్లు తగ్గిందని చెప్పుకొచ్చారు. అసలు రాష్ట్రంలో మద్యాన్ని ప్రోత్సాహించింది ఎవరు?.. తెలంగాణ ప్రజలను తాగుబోతులను చేసింది ఎవరో.. ఈ లెక్కలను చూస్తే తెలిసిపోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. 60 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.65 వేల కోట్లకు మించి పోలేదని.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో లక్షల కోట్లకు చేరిందని అన్నారు. పదేళ్లలో ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారు. మా హయాంలో ఏడాదికి రూ.2500 మాత్రమే పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.

Next Story