DK Aruna : శ్రీతేజను పరామర్శించిన డీకే అరుణ కీలక వ్యాఖ్యలు

by Y. Venkata Narasimha Reddy |

సంధ్య థియేటర్(Sandhya Theatre) ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ(Sri Teja)ను బీజేపీ ఎంపీ డీకే. అరుణ(BJP MP DK Aruna) పరామర్శించారు.

DK Aruna : శ్రీతేజను పరామర్శించిన డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : సంధ్య థియేటర్(Sandhya Theatre) ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ(Sri Teja)ను బీజేపీ ఎంపీ డీకే. అరుణ(BJP MP DK Aruna) పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని, ఓ మనిషి చనిపోవడం, బాలుడు తీవ్రంగా గాయపడటం బాధకరమని, అందరూ దీనిని ఖండించాల్సిందేనన్నారు. సినీ పరిశ్రమం, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉండాలన్నారు. అయితే ఈ ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేయడం కూడా సరికాదన్నారు. హీరో అల్లు అర్జున్‌ (Hero Allu Arjun), ఆయన కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వేధించడం వెనుక అసలు మతలబు వేరే ఉందని.. అది త్వరలో తేలుతుందన్నారు.

రేవంత్ రెడ్డి ఏం చేసినా దానికి కచ్చితమైన కారణం ఉంటుందన్నారు. ఢిల్లీకి సూట్ కేసులు పంపించే అంశంలో ఎక్కడో చెడిందని.. అందుకే అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసినట్లు ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కక్ష సాధింపు దోరణిని తాను ఎప్పుడు చూడలేదన్నారు. అసెంబ్లీలో అసలు సమస్యలు లేవన్నట్లు ఎంఐఎం వాళ్ళతో అడిగించుకుని మరీ సంధ్య థియేటర్ ఘటనపై సీఎం సభలో మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఏడాదిలో ఇచ్చిన హామీలపై జనం ఎక్కడ అడుగుతారో అని రేవంత్ రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపి డైవర్టన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే అల్లు అర్జున్ ఇంటి మీద దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన ఇంటి మీద దాడి చేసిన వాళ్ళల్లో రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వాళ్ళే ఉన్నారని తెలిపారు. అంటే దీని వెనక ఇంకా ఏదో బలమైన కారణం ఉందని సందేహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలి కానీ ఇలా చిల్లర రాజకీయలు చేయద్దు అంటూ ఎంపీ డీకే అరుణ హితవు పలికారు. పుష్ప సినిమాపై మంమంత్రి సీతక్క వ్యాఖ్యలపై స్పందించిన అరుణ గతంలో పోలీసులను హీరోలుగా చూపిస్తూ చాలా సినిమాలు వచ్చాయన్న సంగతి మరువరాదన్నారు.

Next Story