- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మీ వల్ల ఏదైనా సాధ్యమే’.. కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
by Gantepaka Srikanth |
తెలంగాణ యువతపై తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ యువతపై తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని జాగృతి ఆఫీస్‌లో యూత్ ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లాల నాయకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో మార్పు అనేది యువత ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. ఏదైనా మార్పు కావాలని భావిస్తే అది సాధించే వరకు యువత వదిలిపెట్టదని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో గానీ స్వాతంత్ర ఉద్యమంలో గానీ యువతదే కీలక పాత్ర అని గుర్తుచేశారు. తెలంగాణలో ఒక మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అందులో యువతది కీలక పాత్ర ఉండాలని తాను భావిస్తున్నానని అన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న వారు మంచి పేరు తెచ్చుకునేలా పనిచేయాలని కోరారు.
Next Story






