- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎవ్వరిని వదలొద్దు.. డ్రగ్స్ కేసుపై రఘునందన్ రావు సీరియస్ కామెంట్స్
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ప్రజాప్రతినిధుల తీరుపై ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో (Moinabad Drugs Case) బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‍తో పాటు మరో నలుగురికి పాజిటివ్ రావడం తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ అంశంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) స్పందించారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాల్సిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. ఈ వ్యవహారంపై తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు.
ఎవ్వరిని వదలొద్దు:
భావి తరాలకు ఆదర్శంగా నిలవాల్సిన వారే ఇలా ఫామ్ హౌస్ లు, క్లబ్ హౌస్ ల పేరుతో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడటం ఏంటని నిలదీశారు. రెయిడ్స్ కోసం ఫామ్ హౌస్ కు వెళ్లిన ఈగల్ టీమ్ పైనే తుపాకీతో కాల్పులు జరపాలనే ఆలోచన వచ్చిందంటే వాళ్లు ఎంతలా మత్తు మందుకు ప్రభావితం అయ్యారు, ఎంత దుర్మార్గపు ఆలోచనతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరు చట్టం ముందు అందరూ సమానమేనని వారందరిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.






