రైతులకు ఉగాది కానుక.. రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |

ఈనెల 22న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని, రేపు నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభిస్తారని మంత్రి తుమ్మల తెలిపారు.

రైతులకు ఉగాది కానుక.. రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉగాది కానుకగా రేపు సిద్ధిపేట జిల్లా నర్మెటలో (Narmeta) ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) చెప్పారు. ఈ ఫ్యాక్టరీని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని, నర్మటలో 3 రోజుల పాటు వ్యవసాయ ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నామని ఈ ప్రదర్శనకు మంత్రులు, ప్రజా ప్రతినిధులందరి నీ ఆహ్వానించామన్నారు. ఇవాళ మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడిన తుమ్మల.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు. ఈనెల 22న రైతు భరోసా (Rythu Bharosa) నిధులను కాడూ సీఎం విడుదల చేస్తారని వెల్లడించారు. 22న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ చేయబోతున్నామని తెలిపారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతు సంక్షేమ కార్యక్రమాలు ఆగవద్దని సీఎం చెప్పినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వానికి రైతాంగమే ప్రాధాన్యత అని చెప్పారు. ఎన్నికల్లో రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు రుణమాఫీ చేస్తామని చెప్పినట్లు చేసి చూపించామన్నారు.

మొక్కజొన్న కొనుగోళ్లపై..

మొక్క జొన్న కొనుగోళ్లపై ధర్నాలు చేయడం తేలికైన పని కానీ ధర్నాలు చేస్తున్నవారే కేంద్రంలో ఉన్నారని వారు కొనుగోలు చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లను ఇవాళ్టి నుంచి ప్రారంభించిందని చెప్పారు.
Next Story