- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponguleti: ఆ విషయంలో వెనుకబడిపోయాం.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: 2025 సంత్సరంలో తీపితో పాటు కొద్దిగా చేదు, వగరును రుచి చూశామని రాబోయే 2026 సంవత్సరంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలంతా సంతోషాన్నే చూడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఆకాంక్షించారు. ఇవాళ ఖమ్మం జిల్లా పాలేరులో (Paleru) నూతనంగా గెలిచిన సర్పంచ్‍లు వార్డు మెంబర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కాంగ్రెస్ రెబల్స్ గెలుపొందారని అన్నారు. తమకు సీట్లు దక్కలేదని కొంత మంది కాంగ్రెస్ నేతలే ఇద్దరు ముగ్గురు బరిలోకి దిగడంతో పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) కొన్ని సీట్లు కోల్పోయామని, పదేళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ మద్దతుదారులు కేవలం వేళ్లమీద లెక్కబెట్టేంతా సీట్లు మాత్రమే గెలిచారన్నారు. రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాయుల ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
చేసింది చెప్పుకోవడంలో వెనుకబడిపోయాం:
గత 20 ఏళ్లలో లేని అభివృద్ధి ఈ రెండేళ్లలో జరిగిందని ప్రజాక్షేత్రంలో నిలిచేది మనమేనన్నారు. అయితే పార్టీలో ముఖ్యనాయకులుగా ఉన్న వారు ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చెప్పడంలో వెనుకబడిపోయామనేది వాస్తవం అని హాట్ కామెంట్స్ చేశారు. ఇకనైనా ప్రజా ప్రభుత్వం గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులు ప్రతి గడపకు తీసుకువెళ్లాల్సిన, చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా సన్నబియ్యం ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో కూడా పేదలకు ఇళ్లు కట్టుకునేందుకు కేవలం రూ. లక్ష మాత్రమే ఇస్తున్నారు. కానీ తెలంగాణలో పేదల ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వకోపోయినా మొదటి సంవత్సరంలోనే రూ. 22 వేల 500 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మంజూరు చేసి వాటికి ప్రతి సోమవారం బిల్లులు విడుదల చేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ చేయని పనులు తామే చేసినట్లు ప్రజలను మభ్యపెడితే ఇవాళ మనం ఇన్ని మంచి పనులు చేసి కూడా వాటిని చెప్పుకోలేకపోతున్నామన్నారు.






