- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ, రేవంత్ ఇద్దరూ ఒక్కటే.. పైకి నాటకాలు: కేసీఆర్ ఫైర్
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ‘ఆర్ఆర్’ ట్యాక్స్ వసూల్ చేస్తున్నాడని ప్రధాని మోడీ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోడీ

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ‘ఆర్ఆర్’ ట్యాక్స్ వసూల్ చేస్తున్నాడని ప్రధాని మోడీ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోడీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కొత్తగూడెంలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం రేవంత్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు.. మరీ వాళ్లిద్దరూ ఒకటి కాకపోతే సీఎంపై విచారణకు ఈడీని, ఐటీని దించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు గోదావరి నీళ్లు లేకుండా చేస్తామని మోడీ అన్నారు, మరీ ప్రధాని వ్యాఖ్యలను సీఎం రేవంత్ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకటేనని.. పైకి నాటకాలు ఆడుతున్నారని కేసీఆర్ విమర్శించారు.
Next Story






