రెండు విషయాలను CM రేవంత్ నొక్కి చెప్పారు.. MP మల్లు రవి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-28 11:50:09  IST  )

తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi) కీలక వ్యాఖ్యలు చేశారు.

రెండు విషయాలను CM రేవంత్ నొక్కి చెప్పారు.. MP మల్లు రవి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో మల్లు రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్య ప్రదేశ్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రెండు విషయాలు చెప్పారు.. ఒకటి గాంధీ(Gandhi), అంబేద్కర్(Ambedkar) ఆశయాలు నెరవేర్చే వారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) వెంట ఉండాలి అన్నారు.. మరొకటి గాడ్సే‌ను అనుసరించే వాళ్ళు మోడీ(PM Modi), అమిత్ షా(Amit Shah) వెంట ఉండాలి అన్నారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ రెండు స్టేట్‌మెంట్లపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగందని మల్లు రవి అన్నారు. 140 కోట్ల మంది ఈ అంశాలపై డిస్కషన్ చేశారని తెలిపారు.

మహాత్మా గాంధీ(Mahatma Gandhi) ఆలోచనలు అమలు చేసే వాళ్ళు కాంగ్రెస్‌లో ఉన్నారు.. గాడ్సే ఆలోచనలు అమలు చేసే వారు బీజేపీలో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అన్ని గ్రామాల ప్రజలను చైతన్య పరచాలని రాహుల్ గాంధీ(Rahul Gandhi), మల్లిఖార్జున ఖర్గే(Mallikharjuna Kharge) పిలుపునిచ్చారని తెలిపారు. మొట్టమొదటగా ఆ కార్యక్రమాన్ని తెలంగాణ కొత్త ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) మొదలు పెట్టారు.. ఈ రిలే కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని మల్లు రవి విజ్ఞప్తి చేశారు.

Next Story