సర్వేలు మనకే అనుకూలం… మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-02-02 10:30:31  IST  )

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

సర్వేలు మనకే అనుకూలం… మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్  కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) అన్ని సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయని మంచి మెజారిటీతో గెలువబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ పీఏసీ జూమ్ మీటింగ్‍లో ఆయన పార్టీ నేతలను ఉద్దేశిం మాట్లాడారు. పార్టీ గుర్తులపై ఈ ఎన్నిలు జరుగుతున్నాయి కాబట్టి అందూర చాలెంజ్ గా తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. టికెట్ రికమండేషన్ చేసే నేతలు ఆ అభ్యర్థుల గెలుపు బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ లోకల్ మేనిఫెస్టోనూ సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలన్నారు. అభ్యర్థులకు బి-ఫామ్‍లు అందజేసే బాధ్యత డీసీసీలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో నేతలు బీసీ రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించారు. బీసీలక రాహుల్ గాందీ ఇచ్చిన మాట ప్రకారం జిర్వేషన్ ఇచ్చేలా కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని కోరారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర ముఖ్య నేతలతో హాజరయ్యారు.

రెండేళ్లలో పనిపూర్తి చేసి ప్రజ‌ల విశ్వాసాన్ని నిల‌బెట్టుకున్నాం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Next Story