CM Revanth Reddy: 'ఊపర్‌ షేర్వాణీ.. అందర్‌ పరేషానీ' ప్రభుత్వ ఉద్యోగులకు డీఏపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-03-12 11:19:04  IST  )

నిరుద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: ఊపర్‌ షేర్వాణీ.. అందర్‌ పరేషానీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త అధ్యాపకులు రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణ వచ్చాక నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని యువత భావిస్తే గత పాలకులు నిరుద్యోగులను, నియామక ప్రక్రియను నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వానికి ఉద్యమం పట్ల బాధ్యత లేక నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు. ఎంపిక కాబడిన 1,292 మంది జూనియర్ లెక్చరర్లు, 240 మంది పాలిటెక్నిక్ కళాశాల అధ్యపకులకు బుధవారం రవీంద్రభారతిలో (Ravindra Bharthi) జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. నిరుద్యోగుల ద్వారా గద్దెనెక్కిన గత పాలకులు అధికారంతో విర్రవీగుతుంటే నిరుద్యోగులంతా పట్టుదలతో ఈ ప్రభుత్వాన్ని తీసుకువచ్చారు.గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలు తీసేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయని గతంలోనే చెప్పానన్నారు. తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడి ఉద్యోగాలను తొలగించడం ద్వారా ఇవాళ నిరుద్యోగులు శాశ్వాత ఉద్యోగాలు అందిపుచ్చుకుంటున్నారని చెప్పారు. మా ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో యంగ్ ఇండియా వర్సిటీ ఏర్పాటు చేశాం. దానికి చైర్ పర్సన్ గా ఆనంద్ మహీంద్రాను నియమించామన్నారు.

విద్యాశాఖ దిగజారడం ఆందోళనకరం:

బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం తెలంగాణలోని నిరుద్యోగుల 12 ఏళ్ల యుక్తవయసును కాలగల్భంలో కలిపేసింది. ఈ అన్యాయం మీ కుటుంబాలకు కాదు తెలంగాణ రాష్ట్రానికే జరిగిందన్నారు. మా ప్రభుత్వ బాధ్యత తీసుకున్న వెంటనే టీజీపీఎస్సీ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని అధికారులను సమన్వయం చేసుకుంటూ ఇప్పటి వరకు 57,946 ఉద్యోగ నియామకాలు చేపట్టామని గర్వంగా మీ ముందు నిలబడ్డానన్నారు. ఈ ప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగుల కృషి ఉన్నదని, ఈ ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతో న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామన్నారు. గతంలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైంది. విద్యాశాఖలో చివరి నుంచి పోటీ పడే పరిస్థితికి తెలంగాణ దిగజారింది. విద్యాశాఖ దిగజారడం ఆందోళనకరం. తెలంగాణ జాతికి అవమానకరం అన్నారు. ఇది గమనించిన మా ప్రభుత్వం విద్యాశాఖను ప్రక్షాళన చేసి ప్రభుత్వం అండగా నిలబడింది. విద్యకు ప్రాధాన్యం ఇచ్చి విద్యాశాఖకు రూ. 21,650 కోట్లు కేటాయించామన్నారు. వాస్తవాలు అంచనా వేసి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు పోటీ పడలేకపోతున్నాయి? ఎందుకు ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులు చేరడం లేదో మూలాలపై పరిశోధన చేసుకుని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

రాష్ట్రానికి ఆర్థిక క్యాన్సర్:
రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉండవచ్చు. ఆ కారణంతో ప్రభుత్వానికి సహకరించమని ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అనకుంటే ఇంకా మన పరిస్థితులు దిగజారిపోతాయి. నెల నెల జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితికి పడిపోతాం. డిసెంబర్ 2023 కంటే ముందు ఎన్నడైనా మొదటి తారీఖున జీతాలు వచ్చాయా? ఇదివరకే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారిని అడగండి. మేము వచ్చాక మొదటి తేదీన నా ప్రభుత్వం ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. ఈనెల చాలా ఇబ్బంది వస్తే ఆర్బీఐ (RBI) లో తల తాకట్టుపెట్టి మరీ ప్రత్యేకంగా రూ. 4000 కోట్లు తెచ్చి మొదటి తారీఖున జీతాలు ఇచ్చారు. డీఏలు (DA) అని ఉద్యోగులు అంటున్నారు. ఈ ప్రభుత్వం మీది. నేను కస్టోడియన్ ను మాత్రమే. నాకంటే ప్రత్యేకంగా కీరీటం లేదు. కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగులంతా నా ఆత్మబంధువులు అన్నారు. మీకు జీతభత్యాలు ఇచ్చాకే మిగతా కార్యక్రామాలకు వెచ్చిస్తున్నాను. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందన్నారు. కేసీఆర్ కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు చేసుకుని కమీషన్లు తీసుకుని వెళ్లిపోయారు. వారి పేమెంట్లు నేను చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర పరిస్థితి ఉప్పర్ షేర్వాణీ అందర్ పరేషానీ మాదిరిగా ఉందని ఈ విషయాన్ని నేను చెప్తే రాష్ట్రం దివాలా తీసిందని చెప్తావా అని నన్ను అంటున్నారు. ఈ రాష్ట్రానికి కేసీఆర్ ఆర్థికంగా క్యాన్సర్ ఇచ్చిపోయారు. అలాంటప్పుడు ఇంకా బాగున్నామని ఎన్నాళ్లు చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఐదేళ్ల కోసం ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. కానీ ఏడాది కాకుండానే దిగిపోవాలని పదేళ్లు పాలించిన వారు దుఃఖపడుతున్నారని మండిపడ్డారు.

Next Story