Jubilee Hills: జూబ్లీహిల్స్ లో కూటమి పోటీపై ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |

జూబ్లీహిల్స్ లో కూటమి పోటీపై ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Jubilee Hills: జూబ్లీహిల్స్ లో కూటమి పోటీపై  ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ గడ్డ మీద జూబ్లీహిల్స్ బైపోల్ (Jubilee Hills By Poll) పొలిటికల్ హీట్ పెంచుతోంది. మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఈ స్థానానికి బై పోల్ తప్పనిసరి కాగా ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress), బీజేపీలు (BJP) గెలుపు గుర్రాల కోసం వెతుకులాట ప్రారంభిస్తే ఆశవాహులు సైతం అంతే స్థాయిలో తమ టికెట్ ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో జూబ్లీహిల్స్ పొలిటికల్ ఈక్వేషన్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పొత్తు ఎదైనా ఉండబోతున్నదా లేక ఒంటరిగానే బరిలోకి దిగుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.

కూటమి అభ్యర్థిపై చర్చ:

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఇదే ఫార్ములాను జూబ్లీహిల్స్ బై పోల్ లో ప్రయోగించబోతున్నదనే చర్చ జరుగుతున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెబుతున్న బీజేపీ.. ఏపీ తరహా కూటమి తెలంగాణలోను ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా జూబ్లీహిల్స్ బై పోల్ పై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూటమి అభ్యర్థి పోటీపై క్లారిటీ ఇచ్చారు. జూబ్లీహీల్స్ ఉప ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసే ప్రతిపాదన ఏమీ రాలేదని ఏపీ ఆలోచన వేరు.. తెలంగాణ ఆలోచన వేరు అని చెప్పారు. ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన.. ఉమ్మడి తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తూనే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం స్వతంత్రంగా పని చేయడం బీజేపీ ప్రత్యేకత అన్నారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని.. పార్టీ పెద్దల ఆలోచన మేరకు జూబ్లీహిల్స్ బై పోల్ నిర్ణయం ఉంటుందన్నారు.

Next Story