ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టం.. కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రులు

by Gantepaka Srikanth |

వరంగల్ పట్టణంలో మంత్రులు కొండా సురేఖ(Konda Surekha), సీతక్క(Seethakka)లు మెగా జాబ్ మేళాను ప్రారంభించారు.

ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టం.. కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రులు
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ పట్టణంలో మంత్రులు కొండా సురేఖ(Konda Surekha), సీతక్క(Seethakka)లు మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాబ్ మేళాలో 60 కంపెనీలు పాల్గొన్నాయని.. దీంతో 11 వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు దక్కుతాయని అన్నారు. కేసీఆర్‌ హయాంలో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)లో అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. జాబ్ మేళాలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీగా తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దాంతో హోటల్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన భారీ అద్దాలు పగిలిపోవడంతో ముగ్గురు యువతులకు గాయాల్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు క్షతగాత్రులను ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు.

Next Story