హుజూరాబాద్‌లో పార్టీల లొల్లి ఉన్న మాట వాస్తవమే కానీ: ఈటల రాజేందర్

by Gantepaka Srikanth |

హుజూరాబాద్‌లో పార్టీల లొల్లి ఉన్న మాట వాస్తవమే కానీ: ఈటల రాజేందర్

హుజూరాబాద్‌లో పార్టీల లొల్లి ఉన్న మాట వాస్తవమే కానీ: ఈటల రాజేందర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ చాలా బలంగా ఉందని అన్నారు. గతంలో హుజూరాబాద్‌లో పార్టీల లొల్లి ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడా పరిస్థితి లేదని.. బీజేపీ చాలా వేగంగా పుంజుకోవడంతో పాటు బలంగాస్థాయికి చేరుకుందని తెలిపారు. ఉపాధి హామీ పథకం విషయంలో సర్పంచ్‌లపై కుట్రలు జరిగాయని తెలిపారు. తనకు రాజకీయాల కంటే ప్రజలతో సంబంధాలే ముఖ్యమని అన్నారు. ‘‘గ్రామాల్లో కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి జరుగుతోంది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కూడా కేంద్రం నిధులతోనే నిర్మిస్తున్నారు. పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు. ఎన్నికల్లో కొంతమంది డబ్బులిచ్చి ఓట్లను కొంటాం అంటున్నారట. మనుషుల ఆత్మగౌరవానికి వెలకట్టలేరు. ఈటల పేదల పక్షాన కొట్లాడే బిడ్డ. అధికారం ఉన్నా లేకున్నా మీకు కావాల్సినవి అందించే భాద్యత నాది’’ అని ఈటల రాజేందర్‌ అన్నారు.

Next Story