- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Eatala Rajendar: ఆశయాన్ని ముద్దాడే వరకు వెనకడుగు వేయం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యమైందో ప్రతి బీసీ ఇంట్లో సాధించాలనే తపన ఉందని, బీసీ రాజ్యాధికారం కూడా సాధ్యం అవుతుందని ఎంపీ ఈటెల రాజేందర్ధీమా వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యమైందో ప్రతి బీసీ ఇంట్లో సాధించాలనే తపన ఉందని, బీసీ రాజ్యాధికారం కూడా సాధ్యం అవుతుందని ఎంపీ ఈటెల రాజేందర్ధీమా వ్యక్తం చేశారు. ఆశయాన్ని ముద్దాడే వరకు ఐక్య ఉద్యమాలు చేద్దామని, బీసీ బంద్ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాకుండా యావత్ తెలంగాణలో 52 శాతం ఉన్న బీసీలది కావాలన్నారు. శనివారం జేబీఎస్వద్ద జరిగి బంద్‌లో పాల్గొన్ని మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు గడిచిన ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయారని, మంత్రివర్గంలో కూడా సమునచిత స్థానం లేదని, ఏ పార్టీ పాలించిన బీసీలకు మంత్రి పదవులు ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ వర్గాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా నష్టపోతున్నారని అనేక పార్టీలు మాట్లాడి మేనిఫెస్టోలో పెట్టారు కానీ చాలా సమస్యల పరిష్కారం జరగలేదన్నారు. తెలిసి కూడా మోసం చేయవద్దని డ్రామాలు ఆడవద్దని బీసీల ఆత్మగౌరవంతో వెలగాటమాటా చలగాట మాట వద్దని చాలామంది మేధావులు ఈ ప్రభుత్వానికి చెప్పారని గుర్తు చేశారు.
మేధావులు న్యాయ నిపుణులు చెప్పిందే నిజమని నిరూపితమైందన్నారు. రిజర్వేషన్లు పెంచే బాధ్యత రాష్ట్రాలకు లేదని, కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని రాష్ట్రాల్లో చేస్తామని ఎవరైనా చెప్తే నమ్మవద్దని, మోసపోకండి అని స్వయంగా రేవంత్ రెడ్డి నే చెప్పాడు. కానీ ఆయన మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా చిత్తశుద్ధితో రిజర్వేషన్లు అమలు చేసిందని, పెరియార్, అనాదురై ఆధ్వర్యంలో అనేక గొప్ప ఉద్యమాలు జరిగాయి. రాజ్యాంగం జడ పదార్థం కాదని ప్రజల ఆకాంక్ష మేరకు నిర్ణయాలు జరగాలని 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్ల పాటు బీసీల ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య అన్ని రంగాలపై సమగ్ర సర్వే చేసి శాసనసభలో ఆమోదం తెలిపిందన్నారు. ఆ రిపోర్ట్ తో పార్లమెంట్లో ఒప్పించి రాజ్యాంగంలో 9 వ షెడ్యూల్ లో చేర్చారు. అప్పుడు కోర్టులు కూడా తప్పు పట్టలేదు, కొట్టివేయలేదని గుర్తు చేశారు.
కేసీఆర్ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ది లేదు :
తెలంగాణలో కూడా కేసీఆర్ ఒక సారి సర్వేచేయడంతో పాటు బీసీ కమీషన్ వేశారు. ఎన్ని కమీషన్లు వేసిన, తీర్మానాలు చేసినా అమలుకాలేదని, నిజాయితీ లేదు కాబట్టి అమలు కాలేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం కూడా పేరుకు కమీషన్లు వేశారు తప్ప నిజాయితీ ఎక్కడ లేదని, గణాంక శాఖలోని జనాభా లెక్కలు లెక్కలు తీసిన అవన్నీ తప్పుల తడక 52 శాతం ఉంటే 42 శాతం అని కాకి లెక్కలు చెప్తే బీసీ సమాజం భగ్గుమన్నదన్నారు. తాను చెప్పేది అబద్ధం అయితే రాజకీయాల నుండి తప్పుకుంటానని, నా మాటలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని, బీసీ ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటమాడవద్దని హెచ్చరించారు.
ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ఆ కుటుంబం వారికే అధికారం దక్కుతుందని ఆ కుటుంబమే ఏలుతుందని, వారసులు లేకపోతే తప్ప వేరే వారికి అవకాశం రాదన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా స్వతంత్రం వచ్చినప్పటినుండి తెలంగాణలో ఒక్క బీసీ, ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాలేక పోయారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ రాష్ట్రంలో బీసీలు 8 మంది మంత్రులుండాలని కానీ ముగ్గురు మాత్రమే ఉండటం వారి నీతికి నిదర్శమన్నారు. బీసీల పట్ల ముసలికన్నీరు కాకపోతే నామినేటెడ్ పోస్టులో ఎందుకు బీసీలకు స్థానం కల్పించలేదు. బీజేపీ నిజాయితీని ఎవరు శంకించలేరని మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటం చూసి మాదిగ రిజర్వేషన్ చేస్తామని మాట ఇచ్చి అమలు చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు.






