- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ ఏడాది దేశ రాజకీయాల్లో కీలక మార్పులు : కిషన్ రెడ్డి
కొత్త సంవత్సరం దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త సంవత్సరం దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఎన్నికల సంవత్సంరం అని చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయన్నారు.
ఇటు తెలంగాణకు అటు దేశానికి ముఖ్యమైన సంవత్సరం అని చెప్పారు. ఈ ఏడాది అవినీతి, కుటుంబ పాలన పోయి నీతివంతమైన పరిపాలన రావాలని అన్నారు. మూడోసారి కూడా కేంద్రంలో మోడీనే గెలవబోతున్నట్లు చెప్పారు. ఈ యేడాది అందరూ శుభం నుంచి శోభాయమానంగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
Next Story






