తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు

by Gantepaka Srikanth |

తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు

తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీస్ శాఖ(Telangana Police Department)లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. జీహెచ్ఎంసీ పునర్విభజనతో మూడు కమిషనరేట్లలోనూ మార్పులు ఉండనున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లను 12 జోన్స్‌గా విభజించనున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6 జోన్లు, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను 3 జోన్ల చొప్పున విభజించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో శంషాబాద్‌, రాజేంద్రనగర్‌ జోన్‌లు కలిసే అవకాశముంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సైతం దాని పరిధిలోకే తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కాగా, జీహెచ్ఎంసీలో 27మున్సిపాలిటీల విలీనంతో ఏర్పడిన బృహత్ హైదరాబాద్‌లో 300 వార్డులు, 60 సర్కిళ్లు, 12 జోన్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే. అంతేకాదు 12 జోన్లకు జోనల్ కమిషనర్లను కేటాయించిన కమిషనర్ కర్ణన్ 60 సర్కిళ్లకు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లను కేటాయిస్తూ నిన్న శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

Next Story