తెలంగాణ ఇంటర్​ విద్యలో కీలక మార్పులు!

by Muthe.Rajitha |

ఇంటర్​ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఇంటర్​ బోర్డు నిర్ణయించింది.

తెలంగాణ ఇంటర్​ విద్యలో కీలక మార్పులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్​ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఇంటర్​ బోర్డు నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉన్న పరీక్షల విధానంలో కీలక మార్పులు, సిలబస్​ మార్చాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ఇప్పుడున్న 100 శాతం రాత పరీక్షల మార్కుల విధానంలో స్థానంలో 80 శాతం రాత పరీక్షకు, 20 శాతం ఇంటర్నల్​ మార్కుల విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విధానాన్ని 2025‌‌–26 అమలు చేస్తామనిప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ ఇంటర్​ బోర్డు లేఖ రాసింది. ఇంటర్​లో ఇంటర్నల్​ మార్కుల విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్​ విద్యా సంస్థ దాదాపు 90 శాతం ప్రైవేటు కాలేజీ చేతుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్నల్​ లకు 20 మార్కులు కేటాయిస్తే ప్రైవేటు కాలేజీల పంట పండినట్లేనని, ఇక ప్రభుత్వ కాలేజీల మూసుకోవాల్సిందేనని, ప్రభుత్వంలో ఆడ్మిషన్​లపై తీవ్రప్రభావం చూపుతుందని, వాటిల్లో చదివితే 20కి 20 మార్కులు వస్తాయని, ఇదే ఆస్త్రాన్ని ఉపయోగించి వారు ఆడ్మిషన్​లు,ఫీజులు పెంచుకునే అవకావం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.

పదో తరగతిలో ఇంటర్నల్​ మార్కుల విధానాన్ని ఎత్తేసిన ప్రభుత్వం అదే ఇంటర్​ కు వచ్చే సరికి 20 శాతం మార్కులను ఎలా కేటాయిస్తుందని విద్యారంగ నిపుణులు, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ విధానం పూర్తిగా ప్రేవేటు కాలేజీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. ఇంటర్​ప్రాక్టికల్స్​ మార్కుల విషయంలో ఏ ప్రభుత్వ కాలేజీలో రాని విధంగా ప్రైవేటు కాలేజీల్లో 100 శాతం మార్కులు వస్తాయని, దీంతో బైపీసీ విద్యార్థులు అత్యధిక ఆ మార్కుల కోసమైన ప్రవేటు కాలేజీల్లో చేరుతారని కొన్ని సంవత్సరాలుగా ఉంది. ఇప్పుడు ఇంటర్నల్​ మార్కుల విధానాన్ని ఇక అంతే సంగతులని, ప్రైవేటు కాలేజీల వ్యాపారం మరింత జోరందుకుంటుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మార్చిన సిలబస్​ అంత సిద్దమైంది. అమలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి చేయడానికి ప్రభుత్వ అనుమతి కోరినట్లుగా సమాచారం.

Next Story