TG: గద్దర్ సినిమా అవార్డుల కమిటీలో కీలక మార్పు

by Gantepaka Srikanth |

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 జ్యూరీ కమిటీలో కీలక మార్పులు చేశారు. స్పెషల్ జ్యూరీ చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజను నియమించారు.

TG: గద్దర్ సినిమా అవార్డుల కమిటీలో కీలక మార్పు
X

దిశ, వెబ్‌డెస్క్: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 జ్యూరీ కమిటీలో కీలక మార్పులు చేశారు. స్పెషల్ జ్యూరీ చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజను నియమించారు. దర్శకుడు రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు గురువారం తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఉగాది సందర్భంగా మార్చి 19న అవార్డులను (Telangana Gaddar Film Awards) ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారాలకు ఎంపికైన చిత్రాల స్క్రీనింగ్‌ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమైంది. తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని, భారతీయ సినీ రంగానికి హైదరాబాదును కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉందని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే.

సమాజం కోసం కళల ద్వారా తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు అంటూ గద్దర్‌ను కొనియాడారు. ప్రతిభ, పారదర్శకత ప్రమాణంగా గద్దర్‌ సినిమా అవార్డుల ఎంపిక ఉంటుందని, గత సంవత్సరం జ్యూరీ సభ్యులు అవార్డుల ఎంపికను గొప్పగా నిర్వహించి, అభినందనలు పొందిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ పురస్కారాలకు ఎంపిక చేసే సినిమాల్లో వాణిజ్య అంశంతో పాటు సామాజిక సందేశం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే రాబోయే రోజుల్లో మంచి సినిమాలను మరింత ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గతేడాదిలాగే ఇప్పుడూ భారీ స్థాయిలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తామన్నారు.

Next Story