- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ప్లాట్ల వేలంపై హౌసింగ్ బోర్డు కమిషనర్ కీలక ప్రకటన
ఈనెల 24న కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పరిధిలో మిగిలిపోయిన చిన్న విస్తీర్ణం గల ప్లాట్ల వేలం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకం

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 24న కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పరిధిలో మిగిలిపోయిన చిన్న విస్తీర్ణం గల ప్లాట్ల వేలం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ వీపీ గౌతం తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. హౌసింగ్ బోర్డు గృహా నిర్మాణ పథకాలను అమలు పరుచుటకు వీలుకాని అక్కడక్కడ గృహాల మధ్య ఉన్న ప్లాట్లు మాత్రమే వేలానికి ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. వేలానికి నిర్దేశించిన ప్లాట్లు అత్యంత విలువైన అభివృద్ధి చెందిన ప్రాంతాలకు సంబంధించినవి ఈ అవకాశం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని బోర్డు ద్వారా చేపట్టే ఎల్‌యూజీ ఎంఐజీ గృహ నిర్మాణాలకు వినియోగిస్తామన్నారు. అదే విధంగా హైదరాబాద్ చుట్టు పక్కల అత్యంత విలువైన సుమారు 700 ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలాలు ఉన్నాయని ఇవి అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. విలువైన బోర్డు భూముల రక్షణకు ప్రహారి నిర్మాణాలు ఇప్పటికే చేపట్టామని, ఇందుకు ప్రభుత్వం రూ.25 కోట్లు హౌసింగ్ బోర్డుకు మంజూరు చేసింన్నారు. హౌసింగ్ బోర్డు ఆధీనంలోని భూములను చట్ట విరుద్ధంగా ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






