- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై సీఎం KCR కీలక ప్రకటన
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (NGT) నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో పెద్ద

దిశ, వెబ్‌డెస్క్: పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతులకు నిపుణుల కమిటీ ఆమోదముద్ర వేయడంతో పెద్ద అవరోధం తొలగిపోయిందని అన్నారు. సత్వరమే సాగు నీటి కాల్వల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. అతి త్వరలోనే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని కీలక ప్రకటన చేశారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పరుగులు పెట్టిస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు పచ్చని పైరులతో కళకళలాడుతాయని చెప్పారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు కొందరు కేసులు వేశారని.. కానీ పాలమూరు ప్రాజెక్ట్ అన్నీ అడ్డంకులు దాటుకుందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా గోల్కొండ కోటలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
Read more : ఎటు చూసినా ఆకలి కేకలు.. ఆత్మహత్యలే: CM కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు






