TPPC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

సీ కులగణన(BC Caste Census)తో తెలంగాణలో కొత్త అధ్యాయం మొదలైందని టీపీసీసీ చీఫ్(TPCC Chief), ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు.

TPPC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ కులగణన(BC Caste Census)తో తెలంగాణలో కొత్త అధ్యాయం మొదలైందని టీపీసీసీ చీఫ్(TPCC Chief), ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు. శనివారం ఆయన ఆయన మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వే దేశానికి రోల్‌ మోడల్‌ అని అన్నారు. మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు. బిహార్‌, కర్నాటకలో కులగణన సర్వే చేశారు.. అసెంబ్లీలో మాత్రం తీర్మానం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధతపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని మహేష్‌ కుమార్‌ గౌడ్ కీలక ప్రకటన చేశారు. అన్ని పార్టీలను తీసుకుపోయి కేంద్రంతో చర్చిస్తామని అన్నారు. బీసీలకు సామాజిక న్యాయం కాంగ్రెస్‌(Congress)తోనే సాధ్యమని వెల్లడించారు.

అంతకుముందు కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన విషయంలో భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. రాహుల్‌ గాంధీ దాదాపు 25 రోజుల పాటు తెలంగాణలో పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సోనియాగాంధీ(Sonia Gandhi) తెలంగాణను ఇచ్చారని అన్నారు. రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఆశయం మేరకే సమగ్రమైన కులగణన చేపట్టామన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తూ పూర్తి పారదర్శకంగా సర్వే చేపట్టామని స్పష్టం చేశారు.

Next Story