BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన(Caste Census) సర్వేపై బీఆర్ఎస్(BRS) నేత కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల జనాభాను కావాలనే తగ్గించిన సీఎం రేవంత్ వారని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. ఇప్పుడే కాదు.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, ప్రభుత్వంలోనూ బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసేదాకా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోతామని కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో, రేషన్ కార్డులలో, ఇండ్ల కేటాయింపుల్లో, ఆరు గ్యారంటీల్లో తమ వాటా తగ్గుతుందేమోనని అట్టడుగు స్థాయిలో ఉన్న ఎంబీసీలు, బీసీ బిడ్డలు భయపడుతున్నారని అన్నారు. ‘‘ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే’’ అన్నట్టుగా రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్‌ను విమర్శిస్తుందని ఎద్దేవా చేశారు.

బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని, బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నోటి వెంట కాంగ్రెస్ పార్టీ చెప్పించిందని గుర్తుచేశారు. ఐదున్నర శాతం జనాభా తగ్గించి దాదాపు 22 లక్షల మందిని లేనట్టుగా చిత్రీకరించిన దుర్మార్గాన్ని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిండని మండిపడ్డారు. మళ్లీ రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈసారి కులగణలో కేసీఆర్(KCR) సహా మేమంతా పాల్గొంటాం.. కోరిన వివరణ వివరాలు ఇస్తాము. రీసర్వేకు వెంటనే ఆదేశించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీసీల ఆందోళన ఆవేదనను తాము అర్థం చేసుకున్నాం.. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై రేపటి నుంచి నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా జిల్లా కేంద్రాల వారిగా భావజాల వ్యాప్తిని ప్రారంభిస్తాం. ప్రజలను జాగృతం చేస్తాంమని కీలక ప్రకటన చేశారు. ఒకవేళ ప్రభుత్వం మొండి వైఖరితోనే ఉంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా వారి గొంతు కోసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఏం చేయాలన్న దానిపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించాం.. కేసీఆర్‌కు నివేదించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు.

Next Story

Most Viewed