Kaushik Reddy: బీఆర్ఎస్ సంపూర్ణంగా మద్దతిస్తోంది.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రకటన

by Gantepaka Srikanth |

బీసీ రిజర్వేషన్ల(BC reservations)పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) పేర్కొన్నారు.

Kaushik Reddy: బీఆర్ఎస్ సంపూర్ణంగా మద్దతిస్తోంది.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ రిజర్వేషన్ల(BC reservations)పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీసీ కమిషన్(BC Commission) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరుపై నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) మీడియాతో మాట్లాడారు. కమిషన్ వేయాలని కోర్టు చెప్పిన తర్వాత మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకని ప్రశ్నించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్‌కు బీఆర్ఎస్(BRS) సంపూర్ణ మద్దతు ఇస్తోందని అన్నారు. అసలు కమిషన్ ముందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడారు. బీసీ కమిషన్‌కు చట్టబద్ధత లేదని కోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అయినా వారికి తాము అభిప్రాయాలు చెప్పేందుకు వచ్చినట్లు తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీ కమిషన్‌లా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

Next Story