తెలంగాణలో కేరళ మోడల్ అమలు: మంత్రి సీతక్క

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-29 12:53:02  IST  )

తెలంగాణలో కేరళ మోడల్ అమలు దిశగా అధ్యయనం చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు.

తెలంగాణలో కేరళ మోడల్ అమలు: మంత్రి సీతక్క
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కేరళ మోడల్(Kerala Model) అమలు దిశగా అధ్యయనం చేస్తున్నామని మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. కేరళ తరహాలో పేదరిక నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అత్యంత పేదలను గుర్తించడంలో మహిళా సంఘాలే కీలకం అని అన్నారు. అత్యంత పేదలను గుర్తించి ఇళ్లు, ఉపాధి, వైద్య సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఇటీవలే భారతదేశంలో తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ అవతరించింది. దీనిని నవంబర్ 2025లో సీఎం పినరయి విజయన్ అధికారికంగా ప్రకటించారు. విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత, లక్ష్యిత జోక్యాలు మరియు సామాజిక భాగస్వామ్యం ద్వారా పేదరికం నుండి ప్రజలను బయటకు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. ఇదే తరహాలో తెలంగాణలోనూ చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Next Story