- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CRISP: తెలంగాణలో కేరళ మోడల్..! మంత్రి సీతక్కతో రిటైర్డ్ ఐఏఎస్ భేటీ.. సంస్థతో ఎంఓయూ
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం మంత్రి సీతక్కతో క్రిస్ప్ (సీఆర్ఐఎస్‌పీ) సంస్థ మెంబర్ సెక్రటరీ, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ఆర్. సుబ్రహ్మణ్యం భేటీ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం (Minister Seethakka) మంత్రి సీతక్కతో క్రిస్ప్ (CRISP) సంస్థ మెంబర్ సెక్రటరీ, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ఆర్. సుబ్రహ్మణ్యం భేటీ అయ్యారు. 14 రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి క్రిస్ప్ పనిచేస్తున్నదని, ఆయా రాష్ట్రాలకు ఉచితంగా సంస్థ సేవలందిస్తున్నదని క్రిస్ప్ మెంబర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. సంస్థ కార్యకలాపాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి సీతక్కకు నివేదించారు. ఆయా రాష్ట్రాల్లో ఆయా రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, ఫలితంగా సాధించిన పురోగతిని మంత్రికి వివరించారు. కేరళ మాజీ చీఫ్ సెక్రటరీ విజయానంద్ అధ్యక్షతన, 10 మంది సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో క్రిస్ప్ సంస్థ పని చేస్తున్నట్లు తెలిపారు. కేరళ గ్రామ పంచాయతీల బలోపేతం కోసం విజయానంద్ కృషి చేసినట్లు వెల్లడించారు.
విజయానంద్ (Vijayanand) అనుభవాలతో తెలంగాణలో గ్రామపంచాయతీల బలోపేతం, గ్రామాల అభివృద్ధి కోసం సంస్కరణలు చేపట్టే ఆలోచనలో మంత్రి సీతక్క, తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. గ్రామ పంచాయతీల కార్యకలాపాల్లో మహిళ స్వయం సహాయక బృందాల సహకారం తీసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మహిళా సంఘాలు, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం సాధిస్తే గ్రామాల్లో అద్భుతాలు సృష్టించవచ్చు.. కేరళ మోడల్‌లో ఈ విధానం సక్సెస్ అయిందన్న అభిప్రాయంలో మంత్రి సీతక్క, తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఆ దిశలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఇవ్వాలని సంస్థ సెక్రటరీ సుబ్రహ్మణ్యం కి మంత్రి సీతక్క సూచించారు. యాక్షన్ ప్లాన్ క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.
గ్రామ సభల నిర్వహణ, గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధిగా మార్చే ప్రణాళికలు, స్థానిక ప్రభుత్వాల్లో సంస్కరణలు తెచ్చే దిశలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని మంత్రి సీతక్క కోరారు. స్థానిక ఎన్నికలు పూర్తయి కొత్త పాలకమండళ్లు ఏర్పడే నాటికి యాక్షన్ ప్లాన్ ఖరారు చేయాలని సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంతో క్రిస్ప్ (CRISP) Centre for research in schemes & Policies సంస్థ ఎంఓయూ కుదుర్చుకుంది. మంత్రి సీతక్క సమక్షంలో క్రిస్ప్ మెంబర్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, సీఆర్డీ డైరెక్టర్ సృజన ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.






