- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో దారుణం.. పైలట్ శిక్షణా విద్యార్థినిపై అత్యాచారం
by Naga Rani Yarlagadda |
హైదరాబాద్ లోని ఓ ప్రముఖ పైలట్ శిక్షణా సంస్థలో దారుణ ఘటన జరిగింది. తన వద్ద శిక్షణ పొందుతున్న యువతిపై అదే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: భాగ్యనగరంలోని బేగంపేటలో ఉన్న ఒక ప్రముఖ పైలట్ శిక్షణా సంస్థలో దారుణం వెలుగుచూసింది. తన వద్ద శిక్షణ పొందుతున్న ఒక యువతిపై అదే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా బయటపడింది. కేరళ రాష్ట్రానికి చెందిన నసీముద్దీన్ ను నిందితుడిగా గుర్తించారు. అదే సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ లేదా టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పరిచయం పెంచుకుని, ఆమెకు తెలియకుండా కొన్ని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పెడతానని, ఆమె కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించి లోబరుచుకున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2025 జనవరి నుంచి నిందితుడు బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించారు. పోలీసులు నసీముద్దీన్ ను అరెస్ట్ చేసి, దర్యాప్తు చేపట్టారు.
Next Story






