CPI-Kavitha: ఎమ్మెల్సీ కవితతో భేటీపై క్లారిటీ ఇచ్చిన కేరళ సీపీఐ ఎంపీ సందోష్ కుమార్

by Ramesh Naini |

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తో కేరళకు చెందిన సీపీఐ రాజ్యసభ సభ్యుడు సందోష్ కుమార్ భేటీ అయిన విషయం తెలిసిందే.

CPI-Kavitha: ఎమ్మెల్సీ కవితతో భేటీపై క్లారిటీ ఇచ్చిన కేరళ సీపీఐ ఎంపీ సందోష్ కుమార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)తో కేరళకు చెందిన సీపీఐ రాజ్యసభ సభ్యుడు సందోష్ కుమార్ (CPI MP Sandosh Kumar) భేటీ అయిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వచ్చిన ఎంపీ సందోష్ పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీపై తాజాగా ఆయన తెలంగాణ సీపీఐ స్టేట్ ఆఫీస్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ కవితను తాను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, ఆమె ఆహ్వానం పైన మర్యాద పూర్వకంగా కలిసినట్లు సీపీఐ రాజ్యసభ సభ్యులు పి. సందోష్ కుమార్‌ తెలిపారు.

రాజకీయ, ఇతర అంశాలపై మా మధ్య చర్చ జరగలేదని స్పష్టం చేశారు. తమ భేటీని తప్పుగా అన్వయించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. తనకు హైదరాబాద్‌లో అనేక మంది రాజకీయ మిత్రులున్నారని, వ్యక్తిగత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చానని, ఈ సందర్భంగా కవిత ఆహ్వానం మేరకు మర్యాద పూర్వకంగా వారి ఇంటికి వెళ్ళినట్లు సందోష్ కుమార్‌ తెలిపారు.

Next Story